Gangula Kamalakar : ఏపీలో కరెంట్ లేదు,పంటలు లేవు, సీఎం జగన్,మంత్రి బొత్సలపై తెలంగాణ మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది.బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు.సీఎం జగన్ ఆడించే నాటకాలు.

Gangula Kamalakar Counter To Botsa Satyanarayana
Gangula Kamalakar..Botsa Satyanarayana : విద్యా వ్యవస్థపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు రాష్ట్రాల మంత్రులు విమర్శలు, ప్రతివిమర్శలతో హీటెక్కిస్తున్నారు. తెలంగాన విద్యావస్థలో చూచి వ్రాతలు, కుంభకోణాలు చూస్తున్నామన్నారు ఏపీ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ. తెలంగాణలో టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు. బొత్స్ వ్యాఖ్యలపై తెలంగాణమంత్రులు అంతకుమించి అన్నట్లుగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
దీంట్లో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar)బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)వ్యాఖ్యలపైనే కాకుండా సీఎం జగన్ (YS Jagan), ఏపీలో ఉన్న పరిస్థితులపై విమర్శలు, సెటైర్లతో విరుచుపడ్డారు. ఏపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యావ్యవస్థలో సీట్లను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ‘‘బొత్స సత్యనారాయణ నేను చెప్పేది వినాలి’’అంటూ ఏపీకి, తెలంగాణ విద్యావ్యవస్థకు తేడాలను వివరించారు. రాష్ట్రాలుగా విడిపోయినా ఇంకా తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 308 గురుకులాలు మాత్రమే ఉన్నాయని అదే తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 1009 గురుకులాల స్కూల్స్ ఏర్పాటు చేశామని ఉమ్మడి ఏపీలో గురుకులాల్లో 83వేలమంది మాత్రమే చదివేవారని…ఇప్పుడు 6లక్షల 75వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారని తెలిపారు.
Sabitha Indra Reddy: మీరా మా గురించి మాట్లాడేది.. ఏపీ దుస్థితి ఇంత ఘోరంగా ఉంది: బొత్సకు సబిత కౌంటర్
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదన్నారు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది అంటూ ఎద్దేవా చేశారు. మా దగ్గర పొరపాటున తప్పు జరిగితే చర్యలు తీసుకుంటాం శిక్షలు విధిస్తాం. తప్పు చేసిన దొంగలను పట్టుకుని జైలుకు పంపిస్తామన్నారు. నేనిచ్చిన సమాధానంపై మత్రి బొత్స స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో అడుగులుపెట్టాలన్నారు. బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు అంటూ సెటైర్లు వేశారు. ఇవన్నీ సీఎం జగన్ ఆడించే నాటకాలు అంటూ మండిపడ్డారు. జగన్ ఆడిస్తున్న దొడ్డిదారి నాటకాలు అంటూ మంత్రి గంగుల విమర్శించారు. బొత్స తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని..బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
అలాగే బొత్స చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్ి తీవ్రంగా మండిపడ్డారు. బొత్స చేసిన వ్యాఖ్యలు తెలంగాణను కించపర్చేలా ఉన్నాయని..వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంతస్థాయి ఏపీ మంత్రికి లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలపై చర్చించేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు.