Telangana : స్టార్టప్ ల విజయం తెలంగాణాకే సొంతం : కేటీఆర్
బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్టార్టప్ ల విజయం తెలంగాణాకే సొంతం అని అన్నారు.

Minister Ktr Participating In Cii Meeting
Minister ktr participating in cii meeting : హైదరాబాద్ బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని..ఎన్నో స్టార్టప్ లకు తెలంగాణ ప్రోత్సాహాన్నిస్తోందన్నారు. స్టార్టప్ ల విజయం తెలంగాణకే సొంతం అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
Also read : Telangana : చెత్త తరలించటానికి అత్యాధునిక వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ ఏడున్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని..రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలకు చేరిందని కేటీఆర్ తెలిపారు.పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని..ఇప్పుడు హైదరాబాద్‌లో అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ఎంతగానో ప్రోత్సహిస్తోందన్ని దానికి ఫలితమే హైదరాబాద్ లో ఎన్నో స్టార్టప్ కంపెనీలు విజయవంతంగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.
Also read : Telangana Sona Benefits : తెలంగాణ సోనా.. డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం..!
తెలంగాణలో ఎన్నో స్టార్టప్‌లు వచ్చి విజయవంతంగా నడవటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమేనన్నారు.తమ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ బాగా విజయవంతమైందని అన్నారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. 500 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న పరిశ్రమలకు సత్వర అనుమతి ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందిందని..వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరిగాయలని అన్నారు.