BRS Vs BJP Vs Congress : తెలంగాణలో హాట్ హాట్‌గా రాజకీయం.. అధికార విపక్షాల మధ్య ట్వీట్స్ వార్
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)

BRS Vs BJP Vs Congress : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. నేతలు తమ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ట్విట్టర్ వేదికగా.. ముఖ్యమంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..
ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం – కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం – కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం – కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం – కేసీఆర్
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వం – కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం – కేసీఆర్
పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వం – కేసీఆర్
ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం – కేసీఆర్
ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి ? సహించాలి ?
Also Read..KTR: ఈ పెట్రో ధరల భారం తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది: కేటీఆర్
అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు ? అని ట్విట్టర్ లో ఘాటుగా ప్రశ్నించారు బండి సంజయ్.
ఇక, కాంగ్రెస్ నేతలు.. తగ్గేదేలే అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. వాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, బండి సంజయ్ కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దొంగలు, దొంగలు తన్నుకుంటే చోరీ కథ బయటపడిందట అంటూ ట్విట్ చేసింది కాంగ్రెస్.
దొంగలు,దొంగలు తన్నుకుంటే
చోరీ కథ బయటపడిందట..విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి
తెలంగాణను పట్టించుకోని పార్టీ ఒకటి..ఇచ్చిన హామీలను నెరవేర్చలేని, కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి..
ఇద్దరు తోడు దొంగలే.. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే.. pic.twitter.com/FNXqpTa368
— Telangana Congress (@INCTelangana) March 30, 2023
”విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి తెలంగాణను పట్టించుకోని పార్టీ ఒకటి.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని, కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి.. ఇద్దరు తోడు దొంగలే.. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే..” అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది కాంగ్రెస్.
ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం – కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం – కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం – కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం – కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం – కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం – కేసీఆర్
పంచాయతీ,…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023