Telangana Rain: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. మూడ్రోజులు ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు..
తెలంగాణలో మూడ్రోజులపాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain
Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలి వేగం ఉంటుందని తెలిపారు.
Also Read: అసైన్డ్ భూముల్లో సాగుదారులకు గుడ్ న్యూస్.. అలాంటి వారందరికీ హక్కులు కల్పిస్తామన్న మంత్రి పొంగులేటి
మరోవైపు రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 42 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావొచ్చునని అంచనా వేసింది.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఇవాళ (శక్రవారం) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రేపు (శనివారం) కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమ కొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.