Telangana Missing Cases : తెలంగాణలో ప్రతీరోజూ ఎంతమంది చిన్నారులు అదృశ్యమవుతున్నారో తెలుసా? దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానం

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2022 సంవత్సరంలో మొత్తం 3,443 మంది చిన్నారులు తప్పిపోయారు. వీరిలో 654 మంది (బాలికలు 391 మంది, బాలురు 263 మంది) ఆచూకీ ఇంకా లభించలేదు.

Telangana Missing Cases : తెలంగాణలో ప్రతీరోజూ ఎంతమంది చిన్నారులు అదృశ్యమవుతున్నారో తెలుసా? దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానం

childrens Missing

National Crime Records Bureau Data : తెలంగాణలో ప్రతీరోజూ ఏదోఒక ప్రాంతంలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పలు మిస్సింగ్ కేసులు వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని వెలుగులోకి రావడం లేదు. అయితే, తెలంగాణలో రోజుకు ఎంత మంది చిన్నారులు అదృశ్యమవుతున్నారు? చిన్నారుల మిస్సింగ్ కేసుల్లో దేశంలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది.. వంటి విషయాలను నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పింది.

Also Read : Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2022 సంవత్సరంలో మొత్తం 3,443 మంది చిన్నారులు తప్పిపోయారు. వీరిలో 654 మంది (బాలికలు 391 మంది, బాలురు 263 మంది) ఆచూకీ ఇంకా లభించలేదు. గత మూడు సంవత్సరాల (2020 – 2022) నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ పదివేల మంది నివాసితులకు ఒకరు తప్పిపోతున్నారని.. మొత్తంగా ప్రతీరోజూ సగటున దాదాపు 10 మంది చిన్నారులు తప్పిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది తీవ్ర సమస్యగా పరిగణించింది. అయితే, 2022లో 87శాతం మంది తప్పిపోయిన చిన్నారులను గుర్తించారు.. వీరి సంఖ్య 3,588గా ఉంది. ఈ ఏడాది చిన్నారులు, 18ఏళ్లు పైబడిన వారితో కలుపుకొని 13,766 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

Also Read : Gurugram : ఇంట్లో పనిచేసే బాలికపై సుత్తి, ఇనుప రాడ్‌తో తీవ్ర దాడి.. వివస్త్రను చేసి వీడియో తీసిన యజమాని కుటుంబం

2020లో మొత్తం 3,100 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వీరిలో 1230 బాలికలు, 1,870 మంది బాలురు ఉన్నారు. ఇంకా 655 మంది ఆచూకీ లభించలేదు. అదే సంవత్సరంలో 2978 మంది ఆచూకీ అభించింది. 2020లో చిన్నారులు, 18ఏళ్లు దాటిన వారితో కలుపుకొని 11,404 మంది అదృశ్యమయ్యారు. 2021 సంవత్సరంలో మొత్తం 3,956 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వీరిలో బాలురు 1382 మంది, బాలికలు 2,574 మంది ఉన్నారు. 777 మంది ఆచూకీ లభించలేదు. అదే సంవత్సరం 2978 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది చిన్నారులు, 18ఏళ్లు దాటిన వారితో కలుపుకొని 13,360 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును నమోదు చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లాకౌట్ సర్క్యూలర్ జారీ చేయడం జరుగుతుందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. తప్పిపోయిన చిన్నారుల ఫొటోలు, కొలతలతో సహా అన్ని వివరాలను సేకరించి, కేసులను పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తులను నాలుగు నెలల్లో గుర్తించడంలో విఫలమైతే.. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు బాధ్యత బదిలీ చేయబడుతుందని చెప్పారు. ప్రతీయేటా నమోదవుతున్న అదృశ్యమైన కేసుల్లో 12-16ఏళ్ల వయస్సు యువకులు ఇంటి నుంచి పారిపోతున్న కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు.