Telangana Corona Cases Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా రోజువారీ కేసులు 50కి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 436 కరోనా పరీక్షలు నిర్వహించగా..(Telangana Corona Cases Update)

Telangana Covid Report
Telangana Corona Cases Update : తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా రోజువారీ కేసులు 50కి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 436 కరోనా పరీక్షలు నిర్వహించగా, 34 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 21 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో మరో 32 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,867 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 383 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజు 7వేల 960 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases Update)
Chinese Vaccines: తప్పంతా వ్యాక్సిన్లదే: చైనాలో కరోనా నియంత్రణపై పనిచేయని నాసిరకం వ్యాక్సిన్లు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 3.36 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3వేల 207 మందికి పాజిటివ్‌గా వచ్చింది. ముందురోజు కంటే ఏడు శాతం మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 29 మంది కొవిడ్ తో మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20వేల 403కి చేరాయి. నిన్న 3వేల 410 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసుల రేటు 0.05 శాతంగా కొనసాగుతుండగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న 13 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Cases Update)
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ పలు దేశాల్లో మాత్రం భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల విజృంభణతో దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. 5 నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
Oral Covid Vaccine: జబ్బు, వ్యాధి నుంచి ఓరల్ కొవిడ్ వ్యాక్సిన్ కాపాడుతుందంటోన్న స్టడీ
ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కొన్ని రోజులుగా కొవిడ్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 8వేల 524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. అంతకుముందు వేవ్ సమయంలో డిసెంబర్ 5న అక్కడ 32.2శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో రికార్డయ్యింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కరోనా గరిష్ఠ పాజిటివిటీ రేటు 34.9శాతంగా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.09.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VXFgPW8Zjn— IPRDepartment (@IPRTelangana) May 9, 2022