Chinese Vaccines: తప్పంతా వ్యాక్సిన్లదే: చైనాలో కరోనా నియంత్రణపై పనిచేయని నాసిరకం వ్యాక్సిన్లు

చైనా స్థానిక మీడియా కధనాల ప్రకారం..కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న ఫార్మా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అంతగా ప్రభావం చూపలేదు.

Chinese Vaccines: తప్పంతా వ్యాక్సిన్లదే: చైనాలో కరోనా నియంత్రణపై పనిచేయని నాసిరకం వ్యాక్సిన్లు

China

Chinese Vaccines: చైనాలో మరోమారు కరోనా విలయ తాండవం చేస్తుంది. కోవిడ్ మొదటిదశ కంటే రెండింతలు ఎక్కువగా ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చైనా తూర్పు ప్రాంతంలోని షాంఘై మహానగరం సహా చుట్టుప్రక్కల ఉన్న మరో 70కి పైగా చిన్న నగరాలు, పట్టణాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. గత రెండు నెలలుగా నిత్యం 10 వేల నుంచి 12 వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో. కరోనా వ్యాప్తి కట్టడికి అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ విధించడంతో పాటు..ప్రజలకు బలవంతంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ ఏ స్థాయిలో ఉందంటే..ప్రజలను ఇళ్లల్లోనే బందించి..కనీసం ఆహారం కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే చైనాలో కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి గల కారణాలు ఏంటి?.

Also read:Cyclone Asani: ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

చైనా స్థానిక మీడియా కధనాల ప్రకారం..కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న ఫార్మా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అంతగా ప్రభావం చూపలేదు. నాసిరకం వ్యాక్సిన్లు తయారు చేసిన ఫార్మా సంస్థలు..వాటి పనితీరు, ప్రభావంపై పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండానే ప్రజలకు పంపిణీ చేసింది. చైనాకు చెందిన సినోఫార్మ్, సినోవాక్ మరియు క్యాన్సినో బయోలాజిక్స్ వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. తమ వ్యాక్సిన్ల పనితనాన్ని గొప్పగా చెప్పుకున్న చైనా ప్రభుత్వం..ఆమేరకు 2021 నుంచి విదేశాలకు సైతం ఆయా వ్యాక్సిన్లను ఎగుమతి చేసింది. అయితే చైనా ఫార్మా సంస్థలు సినోఫార్మ్, సినోవాక్ మరియు క్యాన్సినో బయోలాజిక్స్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ లు..అమెరికా ఫార్మా సంస్థలైన ఫైజర్-బయోఎన్‌టెక్, మోడర్నా మరియు జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లతో పోల్చితే తక్కువ ప్రభావం చూపాయి.

Also read:Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు

దీంతో విదేశాల్లోనూ చైనా వ్యాక్సిన్లకు గిరాకీ తగ్గిపోయింది. చైనా సంస్థలు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు ఓమిక్రాన్ వేరియంట్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్వయంగా చైనా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే ఈఏడాది ఫిబ్రవరి చివరి నుంచి చైనాలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా..మే మొదటి వారానికి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో మరోసారి ప్రపంచంపై కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశం ఉందంటూ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 ఆరంభంలో కరోనా.. మహమ్మారిగా అవతరించిన విషయాన్ని సైతం చైనా గోప్యంగా ఉంచింది. ఇప్పుడు కూడా చైనాలో పరిస్థితులు మరింత దిగజారడంపై మరోమారో చైనా ఏదైనా విషయాన్ని గోప్యంగా ఉంచుతుందా అనే సందేహం తలెత్తుతుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read:Russia vs ukraine war: పుతిన్ భయంకరమైన తప్పు చేస్తున్నాడు.. గుణపాఠం తప్పదు..