Hyderabad: తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్.. అతితక్కువ ఖర్చుతో మహానగరాన్ని చుట్టేయొచ్చు..

హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామనుకునే వారికి తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

Hyderabad: తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్.. అతితక్కువ ఖర్చుతో మహానగరాన్ని చుట్టేయొచ్చు..

Hyderabad City

Updated On : March 10, 2025 / 1:53 PM IST

Hyderabad: వేసవి కాలం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవులు రాబోతున్నాయి. చాలామంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మర్ టూర్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, కొందరు విదేశాలకు, మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించేందుకు వెళ్తుంటారు. కొందరు హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ప్రదేశాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే, హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామనుకునే వారికి తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

Also Read: Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ ప్రదేశాలను కేవలం రూ.380 ఖర్చుతో ఒక్కరోజులో చుట్టేసేలా టూరిజం శాఖ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నాన్ ఏసీ, ఏసీ బస్సుల్లో బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్ లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ (నిజాం జూబ్లీ పెవిలియన్), కుతుబ్ షాహీ టూంబ్స్, నెహ్రూ జాపార్క్, లుంబనీ పార్క్ చూడొచ్చు.

Also Read: IRCTC Goa Tour Package : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. IRCTC అద్భుతమైన ప్యాకేజీ ఇదిగో.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే?

నాన్ ఏసీ బస్సులో పెద్దవారికి రూ.380, చిన్నారులకు రూ.300 టికెట్ ధర ఉంటుంది. ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400 ఉంటుంది. అయితే, ఆయా చోట్ల ఎంట్రీ టికెట్, ఫుడ్ ఖర్చులు టూరిస్టులే పెట్టుకోవాల్సిన ఉంటుంది. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour వెబ్ సైట్ ద్వారా లేదా 9848126947, 836728585, 9848540371 సంబర్లలో సంప్రదించవచ్చు.