Vaccine Wastage: తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజ్ 0.5శాతం మాత్రమే
కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో వృథా అవుతుందని తప్పుడు సమాచారం వస్తుంది. కొవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ పట్ల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, తెలంగాణ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 0.5శాతం వేస్టేజి

Vaccine Wastage
Vaccine Wastage: కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో వృథా అవుతుందని తప్పుడు సమాచారం వస్తుంది. కొవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ పట్ల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, తెలంగాణ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 0.5శాతం వేస్టేజి మాత్రమే కనిపిస్తుందని రికార్డులు చెబుతున్నాయి.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ.. 10శాతం వ్యాక్సిన్ వేస్టేజ్ అయిందని రూమర్లు వినిపిస్తున్నాయి. నిజానికి 0.5శాతం మాత్రమే వృథా అయింది. ఏ దేశంలో అయినా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించే సమయంలో ప్రోగ్రామెటిక్ వేస్టేజి ఆ మాత్రం ఉంటుంది.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం.. మేలో కొద్ది రోజులు తెలంగాణలో సున్నా శాతం వేస్టేజి నమోదైంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ జీరో శాతం మాత్రమే వృథా అయింది.
ఏప్రిల్, మే నెలల్లో కొవిడ్ వ్యాక్సిన్ స్టేటస్.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క శాతం కంటే తక్కువగానే ఉంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో 8నుంచి 1శాతం వృథా కనిపిస్తుంటే తెలంగాణలో అంతకంటే తక్కువ వృథా అయింది.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కొవిడ్ వ్యాక్సిన్ బుల్లెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 67లక్షల 69వేల 770వయాల్స్ నుంచి 66లక్షల 95వేల 297డోసుల వ్యాక్సిన్ ఇచ్చాం.. వాటిల్లో వ్యాక్సిన్ వేస్ట్ పర్సంటేజి అనేది కేవలం 0.1శాతం మాత్రమే ఉంది.