Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ

రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయంపై క్యాబినెట్‌ చర్చించనుంది.

Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ

Updated On : January 4, 2025 / 4:12 PM IST

హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్‌ ముందుకు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రానుంది. రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చించనుంది క్యాబినెట్.

సాగుచేసే భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయంపై క్యాబినెట్‌ చర్చించనుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ చర్చించనుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుపై క్యాబినెట్ చర్చించనుంది.

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి.. తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు