తెలంగాణలో ఓసీలు, బీసీలు లెక్క ఇదే.. ఓసీలు 15.79 శాతం, బీసీలు..
బీసీల జనాభా 46.25 శాతంగా ఉంది.

Uttam Kumar Reddy
మంత్రివర్గ ఉప సంఘానికి కులగణన సర్వే చేరింది. దీనిపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు వివరాలు తెలిపారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేసినట్లు ఉతమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నట్లు వివరించారు. 96.9 శాతం (3.50 కోట్లు) మంది ఈ సర్వేలో పాల్గొని వివరాలు నమోదుచేసుకున్నారని తెలిపారు. 3.1 శాతం (16 లక్షల) మంది పలు కారణాలతో వివరాలు ఇవ్వలేదని చెప్పారు.
బీసీ జనాభా లెక్కించాలనేది తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరిక అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. భారత్‌లో ఇటువంటి సర్వే ఎక్కడా జరగలేదని తెలిపారు. వెనుకబడ్డ తరగతుల వారికి న్యాయం చేయాలని తమ ఆకాంక్ష అని ఉత్తమ్ చెప్పారు.
కులగణన ప్రకారం వివరాలు
- తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం
- ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
- ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
- బీసీల జనాభా 46.25 శాతం
- ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతం
- ముస్లి మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతం
- ఎస్టీల జనాభా 10.45 శాతం
- ఎస్సీల జనాభా 17.43 శాతం