KTR: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది..ఎందుకంటే..
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి..

KTR: తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ సీఎం ఎందుకు అవ్వాలి? ఆ అవసరం ఎవరికి ఎక్కువగా ఉంది? 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన సమాధానం ఏంటి? పాతికేళ్ల గులాబీ.. స్పెషల్ ఇంటర్వ్యూ..
”ఇంత కష్టపడి సాధించిన తెలంగాణ ఈ అరాచక శక్తుల పరిపాలనలో ఆగమైపోతున్నది. వీళ్లు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఆ ఆశలు చూసి మోసపోయాం. ఆ మోసాన్ని ఇవాళ ప్రజలు గ్రహించి బాధపడుతున్నారు. మళ్లీ తెలంగాణను సరైన దారిలో పెట్టాలంటే సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ రూపంలో తిరిగి కావాలి. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇదొక్కటే లక్ష్యం.
కేసీఆర్ సీఎం కావడం కూడా ఆయనకంటే కూడా తెలంగాణ సమాజానికి అవసరం. కేసీఆర్ చేసిన పదవే అది. ఆయనకు కొత్తది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనేది కూడా తెలంగాణ సమాజానికి సంబంధించినంత వరకు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు అంతే చారిత్రక అవసరం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.