Corona Vaccine : అపోలో ఆస్పత్రుల్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్..!
అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు.

Apollo
corona vaccine in Apollo hospitals : అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం (అక్టోబర్ 25, 2021) ప్రకటన విడుదల చేశారు.
మొదటగా కోమార్పిడిటీస్ తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని డా.ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. అయితే ఆమోదం రావాల్సిన ఉందని చెప్పారు. 2 నుంచి 8 ఏళ్ల వయసు గల వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ సిద్ధమైందని ఆయన తెలిపారు. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలన్నారు.
Corona Vaccine : త్వరలోనే అందుబాటులోకి మరో టీకా
ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారని తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు కల్గిన వారికి జైకోవ్-డీ వ్యాక్సిన్ 28 రోజుల వ్యవధిలో 3 డోసులు ఇవ్వాలని సూచించారు. ఇది ఇంజెక్షన్ రహిత వ్యాక్సిన్ అని తెలిపారు. వ్యాక్సిన్ లతోనే పిల్లలకు పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించారు.