MLA Acquisition Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ.. రాజకీయంగా ఉత్కంఠ
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

MLAs acquisition case
MLA acquisition case : సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది. జస్టిస్ గువాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేసును విచారించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ తీర్పు ఇచ్చింది.
హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి5న హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్షాలన్నీ విధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
ఫిబ్రవరి8న హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే కేసు వివరాల కోసం సీబీఐ చాలా సార్లు సీఎస్ కు లేఖ రాసింది. ఇకపోతే సీబీఐ ద్వారా దర్యాప్తు త్వరగా పూర్తి కాదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కేసు విచారణపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.