Shamshabad : శంషాబాద్ లో దోపిడి దొంగల బీభత్సం.. వాహనం ఆపి కత్తులతో బెదిరించి 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు
వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే దోపిడి దొంగలు ఆ వాహనాన్ని అడ్డగించారు.

Shamshabad Thieves
Shamshabad Thieves Theft : శంషాబాద్ మండలంలో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. ముగ్గురు గుర్తు తెలియని దుండగులు స్కూటీపై వచ్చారు. దుండగులు వాహనాన్ని ఆపి కత్తులతో బెదిరించి 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు. శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే దోపిడి దొంగలు ఆ వాహనాన్ని అడ్డగించారు. డ్రైవర్ రమేష్, రాములు ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.