తెలంగాణలో 37కు పెరిగిన కరోనా కేసులు.. మణికొండకు చెందిన మహిళకు వైరస్ నిర్ధారణ

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది.

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 05:17 PM IST
తెలంగాణలో 37కు పెరిగిన కరోనా కేసులు.. మణికొండకు చెందిన మహిళకు వైరస్ నిర్ధారణ

Updated On : March 24, 2020 / 5:17 PM IST

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది.

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది. తెలంగాణలో మూడో కాంటాక్టు కేసు నమోదు అయింది. మణికొండకు చెందిన మహిళకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అధికారులు ఆ మహిళను ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ప్రైమరీ కాంటాక్టుగా పేర్కొన్నారు.

స్వీడన్ నుంచి వచ్చిన 34 సంవత్సరాల వ్యక్తి కరోనా పాజిటివ్ నెంబర్ 25 నెంబర్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో 64 సంత్సరాలు కలిగిన మహిళ తల్లి అయి ఉంటుందని వైద్య శాఖ చెబుతోంది. స్వీడన్ నుంచి వ్యక్తి మార్చి 17 న గుర్తించారు. అతని ద్వారా 64 సంవత్సరాలైన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. మరో 32 కేసులు వైరల్ లోడ్ ఎక్కువగా ఉండి, పాజిటివ్ కేసు దిశగా, పెండింగ్ లో ఉన్న కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పుడు అధికారిక ఇచ్చిన నోట్ లో మాత్రం ఇప్పటివరకు రాష్ట్రంలో నెగెటివ్ కేసులు 699, పాజిటివ్ కేసులు 37గా వచ్చాయి. దాదాపు అన్ని నెగెటివ్ కేసులను డిశ్చార్జ్ చేశారు. ఇంకా కరోనా లక్షణాలు ఉండి, ఐసోలేషన్ వార్డులో ఉన్న కేసులు 36 వరకు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. మరిన్ని కేసులు రేపు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 21 రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. 

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

ఇదే విధంగా వ్యవహరిస్తే..మాత్రం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజలు సహకరించకపోతే…24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ  అమల్లో ఉంటుందని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.