Telgangana Elections : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో రేపే విడుదల .. ధరణి స్థానంలో కొత్త యాప్..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించండీ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ హామీలు ఇచ్చింది. మరి రేపు విడుదల చేయనున్న మ్యానిఫెస్టోలో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వనుందో..

Telgangana Elections : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో రేపే విడుదల .. ధరణి స్థానంలో కొత్త యాప్..?

Congress Manifesto

Updated On : November 16, 2023 / 12:33 PM IST

Mallikarjun Kharge ..Congress Manifesto : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించండీ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ హామీలు ఇచ్చింది. మీ ఓటుతో అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఈక్రమంలో రేపు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. దీంట్లో ఎటువంటి హామీలు ఇవ్వనుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనలోను..ప్రచారం ముమ్మరంలోను..మ్యానిఫెస్టో ప్రకటనలోను ముందున్న గులాబీ పార్టీ తమ హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటోంది.ఓ పక్క గులాబీ బాస్..మరోపక్క సీఎం కేసీఆర్ కు కుడి ఎడమ భుజాలుగా మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ధరణి, 24గంటల విద్యుత్ విషయాల్లో విపక్షాలు చేసిన విమర్శలను తమకు అనుకూలంగా మలచుకుని వాటితోనే ప్రతివిమర్శలు చేస్తున్నారు.

తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో అన్ని పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్ల యుద్ధానికి సిద్ధమైన క్రమంలో బీఆర్ఎస్ ఇప్పటికే తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పథకం, కుటుంబానికి 5 లక్షల బీమా,ఆసరా పెన్షన్లు రూ.3 వేలకు పెంపు ఇలా గులాబీ పార్టీ మ్యానిపెస్టో ఉండగా.. మరోపక్క కాంగ్రెస్‌ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ ప్రచారం చేస్తోంది. ఇక ఫుల్ మ్యానిఫెస్టోను రేపు ప్రకటించేందుకు సిద్ధమైంది.

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు

రేపు రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్,రాజేంద్రనగర్ లలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. మల్లికార్జున ఖర్గే రేపు తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం కుత్బుల్లాపూర్లో పర్యటించి  ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరి కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోలో ఇంకేమి వరాలు ఇవ్వనుందో వేచి చూడాలి. కాంగ్రెస్ విడుదల చేయబోయే మ్యానిఫెస్టోపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ మ్యానిఫస్టోలో కొన్ని అంశాలు..
ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్..
అభయహస్తం పథకం తిరిగి పునరుద్ధరణ
అమ్మ హస్తం పేరుతో తొమ్మిది నిత్యావసర వస్తువులు పంపిణీ
రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్
గ్రామ వార్డు సభ్యులకు గౌవర వేతనం
ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు
ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్