వామ్మో.. నేల కూలిన 50వేల భారీ వృక్షాలు.. మేడారం అడవుల్లో బీభత్సం.. అసలేం జరిగింది?
గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Heavy Tornadoes in Medaram Forest : ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మేడారం-తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో టోర్నడో తరహాలో భీకర గాలులు వీచాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 200 హెక్టార్ల మేర 50వేలకు పైగా చెట్లు నేలకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. సుమారు 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Also Read : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు శబ్దం.. అధికారులు ఏం చేశారంటే..
మేడారం అడవుల్లో మహా సుడిగాలి ప్రళయాన్నే సృష్టించిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవ్వడం ఒక ఎత్తు అయితే, మొత్తం మేడారం అడవుల్లో ఉన్న 200 హెక్టార్ల పరిధిలో దాదాపు 15 కిలోమీటర్ల మేర 50వేల చెట్ల నేలకూలాయి. వివిధ జాతులకు చెందిన వందళ్ల ఏళ్ల క్రితం నాటి మహా వృక్షాలు నేలకొరిగాయి. ఇంత పెద్ద ఎత్తున చెట్లు నేలమట్టం కావడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో ముఖ్యంగా అడవి బిడ్డలు, ఆదివాసీలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో జరిగిన అసాధారణ మార్పులు, మహా ప్రళయం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఈ ఊహించని ఘటన అడవి బిడ్డలను, అటవీ శాఖ అధికారులను ఆందోళనలో పడేసింది.
ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణం లోపల అడవికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా పోయాయి. సుడిగాలి సృష్టించిన బీభత్సం చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు గాలికి కొట్టుకుపోయి ప్రధాన రహదారులపై పడటం, ఒకే చోట వేలాది చెట్లు నేలకూలటం.. అందరినీ షాక్ కి గురి చేస్తోంది.