వాళ్లని అక్కడే పూడ్చి పెట్టాలి..!- వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు నిప్పులు

ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.

వాళ్లని అక్కడే పూడ్చి పెట్టాలి..!- వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు నిప్పులు

Cm Chandrababu Naidu : వైసీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు. అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి స్మశానం అంటున్న వారిని అక్కడే పూడ్చి పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు యజ్ఞంలా సహాయక చర్యలు చేస్తుంటే మరోవైపు రాక్షసుల్లా విధ్వంసం చేస్తున్నారని వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు చంద్రబాబు. నా ఇల్లు మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తారని, గేట్లు ఎత్తి విజయవాడను పూర్తిగా ముంచానని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్లే నా ఇంట్లోకి కూడా నీరు వచ్చిందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతి మునిగిందట, స్మశానమట.. వాళ్లను అక్కడే పూడ్చాలి..
”అమరావతి మునిగిపోయిందట. వీళ్లని అక్కడికి తీసుకెళ్లి ముంచాలి. అప్పుడే బుద్ధి వస్తుంది. అమరావతి మునిగిపోయిందని ఎవరు చెప్పారు మీకు? స్మశానం అన్నారు. అక్కడే పూడ్చాలి. అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి, జ్ఞానం ఉండాలి. ప్రజాహితం కోసం పని చేయాలి. దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అమరావతి ఎడారి అంట. ఇంకా సిగ్గు రాలేదా మీకు. ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు. ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలి. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు. కానీ, ఎవరూ భయపడరు. ప్రజలను కాపాడేందుకు ఒక యజ్ఞంలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక రాక్షసుల మాదిరి మీరు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు” అని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇలాంటి దుర్మార్గులకు అసలు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా?
ఇది న్యాయమేనా? ప్రజల కోసం ముందుకు పోవాలా? లేక మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలా? ఇవాళ మళ్లీ వర్షం పడిందని మేము భయపడుతున్నాం. మళ్లీ బుడమేరు పొంగితే నీళ్లు వచ్చి ప్యానిక్ క్రియేట్ అవుతుందని మేము భయపడుతున్నాం. బాధ్యత లేదా మీకు. మీదసలు సమాజ హితం కోసం ఉండే పార్టీనేనా? ఇలాంటి దుర్మార్గులకు అసలు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే అరాచకం, దౌర్జన్యం. అలాంటి అరాచకాలు చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.

ఎప్పుడూ బురదలో తిరగని ఆఫీసర్లను బురదలో తిప్పి పని చేయిస్తున్నాం…
చాలా బాధగా ఉంది. రాత్రి పగలు ఎంతో మంది తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎప్పుడూ బురదలో తిరగని ఆఫీసర్లను బురదలో తిప్పి పని చేయిస్తున్నాం. వారి మీద కోప్పడుతున్నాం. తప్పదు. ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్ కి రారు. అలాంటి ఈరోజు చీఫ్ సెక్రటరీ సహా అందరినీ ఫీల్డ్ లో పెట్టి పని చేయిస్తున్నాం. అదీ మా కమిట్ మెంట్. బురద చల్లే కార్యక్రమం మానండి.

Also Read : మునిగిపోయే చోటే జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కచ్చితంగా హైడ్రా అవసరం ఉంది- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

మీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పండి..
సిగ్గుంటే చేసిన పనికి క్షమాపణ చెప్పుకోండి. మీకు అంతరాత్మ ఉంటే మనసులోనే క్షమాపణ కోరుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే మంచిది కాదు. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. గేట్లు ఎత్తేశారంట, నా ఇల్లు కాపాడుకోవడం కోసం నీళ్లు తరలించామంట. ముంచేశామంట. అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మా ఇంట్లోకి కూడా నీరు వచ్చాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ ఇల్లు నాది కూడా కాదు. రెంట్ ఇల్లు. అది కూడా ఓర్వలేకపోతున్నారు” అని వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు.