Revanth reddy : కొడంగల్ నుంచే పోటీ చేస్తా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4వేలు : రేవంత్ రెడ్డి

ఓపక్క ప్రజలకు హామీలు ఇస్తునే మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధిస్తున్నారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు.

Revanth reddy : కొడంగల్ నుంచే పోటీ చేస్తా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4వేలు : రేవంత్ రెడ్డి

revanth reddy kcr

Revanth reddy CM kcr : అతి త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. మరోపక్క కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలుపు కోసం కసరత్తులు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని దాని నుంచి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాం తామేనంటు రెండు జాతీయ పార్టీలో గెలుపు కోసం పోరాడుతున్నాయి.

కాంగ్రెస్ విషయానికొస్తే గతం కంటే కాంగ్రెస్ మరింత దూకుడుగా ఉంది. కర్ణాటకలో గెలుపును తెలంగాణలో కూడా తేవలనుకుంటోంది. కర్ణాటక గెలుపుతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది. ప్రజలకు హామీలు కురిపిస్తోంది. దీంట్లో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ రూ.4వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.అలాగే పెడింగ్ లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఓపక్క ప్రజలకు హామీలు ఇస్తునే మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధిస్తున్నారు.

Kodandaram : ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ : కోదండరాం

ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తంచేస్తున్న రేవంత్ రెడ్డి ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తానని చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. తాను మాత్రం కొండగల్ నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. కొడంగల్ ను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చిన కేటీఆర్ మాట తప్పారని కొడంగల్ ను అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు.