Nizamabad : వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌

నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో వెళుతున్న ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది.

Nizamabad : వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌

Tractor

Updated On : October 2, 2021 / 8:44 PM IST

Tractor washed in the stream : నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో వెళుతున్న ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది.

జిల్లాలోని సిరికొండ మండలం సర్పంచ్‌ తండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టు రంపాల్‌ కొండాపూర్‌ గ్రామం నుంచి ట్రాక్టర్‌లో ఫ్రిజ్, కూల్‌ డ్రింక్స్‌ డబ్బాలు తీసుకుని వెళ్తుండగా మొండి వాగులో ట్రాక్టర్‌ దిగబడింది.

Mom was sleeping: చనిపోయిన తల్లి శవంతో రోజుల తరబడి గడిపిన చిన్నారులు

అదే సమయంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి భారీగా వరద వచ్చింది. దీంతో ట్రాక్టర్‌ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్‌ ట్రాక్టర్‌ దిగి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది.