హైదరాబాద్ ప్రజలకు బిగ్అలర్ట్.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లకండి..

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ ప్రజలకు బిగ్అలర్ట్.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లకండి..

Traffic Restrictions

Updated On : August 10, 2025 / 7:24 AM IST

Hyderabad Traffic Restrictions: ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్‌లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీగా అభిమానుల మధ్య ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు హైఅలర్ట్.. హైదరాబాద్‌లోనూ ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వాన..

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..?
♦ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి స్టేడియం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కృష్ణా న‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించి, శ్రీన‌గ‌ర్ కాల‌నీ, పంజాగుట్ట వైపున‌కు మ‌ళ్లించ‌నున్నారు.
♦ మైత్రివ‌నం జంక్ష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను యూసుఫ్‌గూడ బ‌స్తీ నుంచి ఆర్బీఐ క్వార్ట‌ర్స్, కృష్ణా న‌గ‌ర్ జంక్ష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
♦ మైత్రివ‌నం జంక్ష‌న్ నుంచి బోర‌బండ బస్టాప్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను స‌వేర ఫంక్ష‌న్ హాల్ మీదుగా కృష్ణ‌కాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, క‌ల్యాణ్ న‌గ‌ర్, మోతీ న‌గ‌ర్ మీదుగా బోర‌బండ‌కు మ‌ళ్లించ‌నున్నారు.
♦ బోర‌బండ బ‌స్టాప్ నుంచి మైత్రివ‌నం జంక్ష‌న్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ప్రైమ్ గార్డెన్ వ‌ద్ద మ‌ళ్లించి, మిడ్ ల్యాండ్ బేక‌రీ, జీటీఎస్ కాల‌నీ, క‌ల్యాణ్ న‌గ‌ర్ జంక్ష‌న్, ఉమేశ్ చంద్ర విగ్ర‌హం యూట‌ర్న్, ఐసీఐసీఐ యూట‌ర్న్ మీదుగా మైత్రివ‌నం జంక్ష‌న్‌కు మ‌ళ్లించ‌నున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్‌లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండియర్ గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే వార్ 2 టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది.