Transgender Appointed : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్ నియామకం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు. 

Transgender Appointed : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్ నియామకం

Telangana election campaigner Transgender Laila

Telangana Election Campaigner Transgender : సాధారణంగా ఎన్నికల ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు, నటులు, సామాజికవేత్తలను ఎన్నికల కమిషన్ ఎంపిక చేస్తుంది. కానీ, ఈసీ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్ ను నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్ లైలా నియామకం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్ లైలాను ఎంపిక చేసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.  ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది.

Telangana Elections : తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్!

అయితే, సాధారణంగా ఎన్నికల ప్రచారకర్తలుగా ఎన్నికల కమిషన్ సెలబ్రిటీలు, నటులు, సామాజికవేత్తలను ఎంపిక చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ సారి వరంగల్ కు చెందిన ట్రాన్స్ జెండర్ లైలాను తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడింది.