High Court : శంషాబాద్ లోని 181 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే : టీఎస్ హైకోర్టు

తప్పుడు భూ రికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)కు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.

High Court : శంషాబాద్ లోని 181 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే : టీఎస్ హైకోర్టు

TS High Court

Updated On : December 14, 2023 / 7:45 PM IST

TS High Court : శంషాబాద్ లోని భూముల వివాదంపై టీఎస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. శంషాబాద్ లోని 181 ఎకరాల భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)వేనని స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. నవంబర్ 18న తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. హైకోర్టు నేడు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల చొరవతో హెచ్ఎండిఏ కేసు గెలిచింది.

తప్పుడు భూ రికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)కు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు.

Jeevan Reddy : బెల్ట్ షాపులను రద్దు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హెచ్ఎండీఏకు చెందిన 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారన్న హెచ్ఎండీఏ వాదనలు వినిపించింది. సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని పేర్కొంది. వాదనలు విన్న హైకోర్టు భూ అక్రమదారుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది.