TS-RERA Chairman: ఆరేళ్ల తరువాత..! ‘రెరా’ చైర్మన్‌గా సత్యనారాయణ.. మరో ఇద్దరు సభ్యుల నియామకం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పురపాలక వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పలుమార్లు సమావేశమై చైర్మన్ పదవికోసం ఎవరిని ఎంపిక చేయాలని చర్చించింది. చివరికి చైర్మన్ పదవికోసం ముగ్గురిని, సభ్యుల కోసం ఆరుగురి పేర్లను ఎంపికచేసి ఆ నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది.

TS-RERA Chairman: ఆరేళ్ల తరువాత..! ‘రెరా’ చైర్మన్‌గా సత్యనారాయణ.. మరో ఇద్దరు సభ్యుల నియామకం

TS-RERA chairman

Updated On : June 13, 2023 / 9:21 AM IST

RERA Chairman: ఆరు నెలల కసరత్తు తరువాత ప్రభుత్వం రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)కి పూర్తి స్థాయిలో చైర్మన్, సభ్యులను నియమించింది. టీఎస్ రెరా చైర్మన్ గా పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు సభ్యులుగా వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ లక్ష్మీ నారాయణ జన్ను, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (రిటైర్డ్) కె. శ్రీనివాస్ రావులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రెరా చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులతో తొలిసారి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటైంది.

Bhopal: ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి వైమానిక దళం.. బీజేపీ కుట్రలో భాగమేనంటూ కాంగ్రెస్ విమర్శలు

రెరాకు పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించేందుకు గత జనవరి 16న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్ పదవికోసం 37 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు సభ్యుల నియామకంకోసం 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల ఎంపిక బాధ్యతను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి అప్పగించారు.

CM KCR: ధరణి వచ్చిన తర్వాత.. పైరవీలు, లంచాలు లేవు

ఈ క్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పురపాలక వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పలుమార్లు సమావేశమై చైర్మన్ పదవికోసం ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై చర్చించింది. నిబంధనల ప్రకారం.. చివరికి చైర్మన్ పదవికోసం ముగ్గురిని, సభ్యుల కోసం ఆరుగురి పేర్లను ఎంపికచేసి ఆ నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం చైర్మన్‌గా సత్యనారాయణ, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్నులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చట్టం ఏర్పడిన ఆరేళ్ల తరువాత పూర్తిస్థాయి అథారిటీ ఏర్పడింది.

Revanth Reddy : నేనుంత వరకు అలా జరగనివ్వను- కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరికపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రెరా చైర్మన్‌గా నూతనంగా నియామకమైన మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ ఎన్. సత్యనారాయణకు పురపాలక శాఖలో అపార అనుభవం ఉంది. దీంతో అతన్ని రెరా చైర్మన్‌గా ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన కె. శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు జారీ అయిన కొద్దిసేపటికే  రెరా కార్యాలయంలో సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు.