TSPSC : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

TSPSC
TSPSC : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. www.telangana.gov.in వైబ్‌సైట్‌లో దరఖాస్తు నమూనా పత్రాలను ఉంచినట్లు తెలిపింది. చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, మరిన్ని వివరాలు వైబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది.
దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని స్పష్టం చేసింది. ఇటీవల గవర్నర్ తమిళి సై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, లింగారెడ్డిల రాజీనామాలను ఆమోదించిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
పశ్నాపత్రాల లీకేజీ అయిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కమిషన్ ఛైర్మన్‌ను తొలగించడంతో పాటు బోర్డు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులతో పాటు పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.
Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో జేబుదొంగల చేతివాటం.. ఎమ్మెల్యే జేబులో నుంచి రూ.20 వేలు మాయం
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిసెంబర్ 11న జనార్దన్ రెడ్డి కలిసి రాజీనామా చేశారు. ఆ తరువాత మరో ముగ్గురు కమిషన్ సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరి రాజీనామాలను గవర్నర్ జనవరి 10న ఆమోదించిన సంగతి తెలిసిందే.