TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.

TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

TSPSC

Updated On : May 1, 2023 / 4:01 PM IST

TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆధారంగా నగదు అక్రమ చలామణి కోణంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలను చంచల్ గూడ జైలులో ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు.

ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ ను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. వారి వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.

టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో దిట్టుబాటు చర్యలను ప్రారంభించింది. 10 కొత్త పోస్టులను మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను పూర్తిగా ప్రక్షాళన చేయాంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. హైకోర్టుకు సమర్పించిన సిట్ దర్యాప్తు అడిషనల్ నివేదికలో కీలక అంశాలు