CM Revnath Reddy: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి ..

CM Revnath Reddy
TTD Chairman BR Naidu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు.. సీఎంను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై కొద్దిసేపు చర్చ జరిగింది.
తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడంపై కొంతకాలంగా తెలంగాణ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, బీఆర్ నాయుడు భేటీతో ఈ విషయంపై పరిష్కారం దొరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.