Crackers Burst : పాతబస్తీలో పండుగ పూట విషాదం.. క్రాకర్స్ పేలుడు..!
హైదరాబాద్ పాతబస్తీలో.. దీపావళి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక కందికల్ గేట్ ప్రాంతంలోని ఓ షెడ్డులో ప్రమాదం జరిగింది.

Two Died In Crackers Burst Old City Hyderabad During Diwali Festival
Crackers Burst : హైదరాబాద్ పాతబస్తీలో.. దీపావళి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక కందికల్ గేట్ ప్రాంతంలోని ఓ షెడ్డులో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఆ షెడ్డులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు.
యూపీకి చెందిన మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే… ఈ ప్రమాదం బాణసంచా కాల్చడం వల్ల జరిగిందా..? కెమికల్ బ్లాస్ట్ వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసుల క్లూస్ టీమ్స్ చేరుకుని పరిశీలిస్తున్నాయి. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వీరేందర్, జగన్నాథ్‌గా పోలీసులు గుర్తించారు.
దీపావళి వేడుకల్లో చిన్నారులకు గాయాలు
మరోవైపు.. హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో పలు చోట్ల చిన్నారులు గాయపడ్డారు. టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు కంటిలో పడడంతో కంటి సమస్యలు తలెత్తాయి. చికిత్స కోసం చిన్నారులను సరోజనీ దేవీ కంటి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 11మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్న చిన్న గాయాలైన ఆరుగురికి చికిత్స అందించి ఇంటికి పంపించారు ఆస్పత్రి వైద్యులు. ఒకరికి తీవ్రంగా గాయాలు కాగా.. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
Read Also : Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!