Telangana Rains: ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Telangana Rains: ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

Telangana Rains

Updated On : September 6, 2021 / 7:21 AM IST

Telangana Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఇప్పటికే పల్లె, పట్టణం, నగరాల్లో జోరువాన కురిసింది. నేటి నుంచి మరో రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వానల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

బంగాళాఖాతంలో తూర్పు, మధ్యప్రాంతంలో 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో కూడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో జోరు వానలు కురవగా సోమవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉండగా.. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది.

అల్పపీడనం ఏర్పడితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. సోమవారం ఈ జిల్లాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ జిల్లాలలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేయగా అత్యవసర పరిస్థితులుంటే తప్ప ప్రజలెవరూ బయటకి రావద్దని హెచ్చరించారు.