మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనం : కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి

  • Published By: bheemraj ,Published On : November 26, 2020 / 03:57 PM IST
మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనం : కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి

Updated On : November 26, 2020 / 4:12 PM IST

kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.



ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ ప్రజలకు సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్.. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మతకల్లోలం చెలరేగితే కేంద్రం చేస్తూ ఊరుకోదన్నారు. నిత్యం మతకల్లోలాలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి నెలకొందన్నారు.



https://10tv.in/five-single-screen-theatres-have-closed-permanently-in-hyderabad/
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. తెలుగు వారు గర్వపడే వ్యక్తులు పీవీ నరసింహారావు, ఎన్ టీఆర్ అని అన్నారు. మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనమన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి వంచన చేరడం ఎంఐఎంకు అలవాటని విమర్శించారు.