ప్రజల ప్రాణాలతో ఆటలు.. 7.3 టన్నుల కల్తీ అల్లం..

గ్రీన్ సిటీలో రహస్యంగా అప్న ఎంటర్‌ప్రైజెస్‌లో కల్తీ అల్లం పేస్టును..

ప్రజల ప్రాణాలతో ఆటలు.. 7.3 టన్నుల కల్తీ అల్లం..

Updated On : July 12, 2024 / 12:10 PM IST

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కల్తీ రాయుళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. హైదరాబాద్‌లో మరో కల్తీ అల్లం ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై సోదాలు జరిపారు.

సోదాల్లో 15 లక్షల రూపాయల విలువ చేసే 7.3 టన్నుల కల్తీ అల్లం పేస్టు దొరికింది. రాజేందర్ నగర్ బుద్వేల్‌లో ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. గ్రీన్ సిటీలో రహస్యంగా అప్న ఎంటర్‌ప్రైజెస్‌లో కల్తీ అల్లం పేస్టును తయారు చేస్తున్నారు. ఈ కేసులో అమీర్ నిజాన్ అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రజల ప్రాణాలను ముప్పు కలిగించే సింథటిక్ కలర్లతో పాటు యాసిడ్లు, కెమికల్ వాటర్ ను ఈ పేస్ట్ తయారీకి వాడుతున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ గతంలోనూ అనేక ముఠాలు పోలీసులకు పట్టుబడ్డాయి. అసలే పరిశ్రమలో అపరిశుభ్ర వాతావరణంతో అన్ని పదార్థాలూ నాసిరకంగా ఉంటున్నాయి. మురుగు నీటిని, హానికారక రసాయనాలను వాడుతుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దానికి తోడు అనేక చోట్ల పూర్తిస్థాయిలో కల్తీ పదార్థాలు తయారు చేస్తూ మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు కల్తీ రాయుళ్లు.

Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు