Bullying Call: చంపేస్తామంటు ఎంఐఎం కార్పొరేటర్ కు బెదిరింపు కాల్

గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి హత్యచేస్తానని బెదిరిస్తున్నాడని లంగర్‌హౌజ్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ వాజీ ఉజ్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్దీ రోజుల నుంచి తన ఫోన్ కు ఆగంతకుడి నుంచి ఫోన్ వస్తుందని

Bullying Call: చంపేస్తామంటు ఎంఐఎం కార్పొరేటర్ కు బెదిరింపు కాల్

Bullying Call

Updated On : June 3, 2021 / 12:30 PM IST

Bullying Call: గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి హత్యచేస్తానని బెదిరిస్తున్నాడని లంగర్‌హౌజ్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ వాజీ ఉజ్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్దీ రోజుల నుంచి తన ఫోన్ కు ఆగంతకుడి నుంచి ఫోన్ వస్తుందని.. అతడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని కార్పొరేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. బుధవారం కూడా ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చినట్లు కార్పొరేటర్ మహ్మద్ వాజీ ఉజ్మా పేర్కొన్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.