Telangana Elections 2023: సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు వ్యాఖ్యలు చేశారు.

Telangana Elections 2023: సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్

Uttam Kumar Reddy

Updated On : May 19, 2023 / 4:37 PM IST

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసన సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై పలు వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి నాటికి జరగడం ఖాయం. సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కోదాడ నియోజక వర్గంలో 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయం తప్పుకుంటా.

గతంలో చెప్పాను మరోసారి చెబుతున్నాను. 1994లో నేను మొదటి సారి శాసనసభ సీటుకు పోటీ చేసి ఓడిపోయాను. అప్పటి నుంచి ఏ హోదాలో ఉన్న కోదాడ ప్రాంతాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. మాకు పిల్లలు లేరు.. కోదాడ నియోజకవర్గ ప్రజలే నా పిల్లలు. అధికారులను ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం.

వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన టైం వస్తుంది. సోషల్ మీడియా ద్వారా జనాలను చాలా ప్రభావితం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కోదాడ అభివృద్ధి జరిగింది. కోదాడలో ఇప్పుడు మొత్తం స్యాండ్, ల్యాండ్ మైన్స్ , వైన్స్. అంతేకాకుండా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మట్టి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్ లో చెప్పలేని విధంగా పోలీసులు వ్యవస్థ వ్యవహరిస్తోంది. కొంత మంది పనికట్టుకొని నా మీద, పద్మావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు” అని చెప్పారు.

Andhra Pradesh : పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ సూచనలపై కేంద్రం ఆలోచిస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్