ఈసారి మగవాళ్ల వంతు.. సీటు కోసం తన్నుకున్న పురుషులు
Viral Video: ఇటీవల చోటుచేసుకుంటున్న ‘మహిళల తన్నులాట‘ ఘటనలకు భిన్నంగా తాజాగా సీటు కోసం పురుషులు గొడవపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో సీట్లు లేక వారు గొడవలు పడుతున్న ఘటనలు ఇటీవలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున బస్సులు ఎక్కుతుండడంతో అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఇటీవల చోటుచేసుకుంటున్న ఈ ఘటనలకు భిన్నంగా తాజాగా సీటు కోసం పురుషులు గొడవపడ్డారు.
వేములవాడ – తిప్పాపురం బస్టాండ్ లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. బస్టాండ్ నుంచి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొందరు గొడవ పడ్డారు. మహిళలు అందరూ బస్సు ఎక్కాక ఒకే ఒక సీటు ఖాళీగా కనపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సీటు కోసం పురుషులు గొడవ పడ్డారు. బస్సు ముందు వారు పిడిగుద్దులు కురిపించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న ప్రయాణికులు
వేములవాడ – తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు.
మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో… pic.twitter.com/q56lyQtPpy
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2024