వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు

"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.

వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు

Konda Murali

Updated On : June 19, 2025 / 5:07 PM IST

వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ ముదురుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసి, రాజకీయంగా దుమారం రేపారు.

అలాగే, తన ఎస్కార్ట్ వ్యవహారంపై వరంగల్ పోలీస్ కమిషనర్ పై కొండా మురళి మండిపడ్డారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కోవర్టులపై దృష్టి పెట్టాలని సీపీకి మురళి హితవు పలికారు. “నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం కాదు.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కొవర్ట్‌లపై చర్యలు తీసుకోండి” అని చెప్పారు.

Also Read: యుద్ధంతో పసిడి ధరలకు రెక్కలు.. ఇంతలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో ఆ జోరుకు కళ్లెం.. ఇప్పుడు బంగారం కొనొచ్చా?

“నాడు కనుబొమ్మలులేని నాయకుడు టీడీపీని భ్రష్టు పట్టించి.. చంద్రబాబును ఓడగొట్టించాడు. మొన్న కేటీఆర్ ను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడు. కనుబొమ్మలు లేని ఆ నేత అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ల స్పెషలిస్ట్. పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి ఆ నేత మా కాళ్లు పట్టుకున్నాడు.

బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికీ పోదు. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు” అని కొండా మురళి వ్యాఖ్యానించారు.