T Jeevan Reddy : మీ ఈడీ, సీఐడీ ఏం చేస్తున్నాయి? ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

T Jeevan Reddy : బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలి? ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేయలేదు.

T Jeevan Reddy : మీ ఈడీ, సీఐడీ ఏం చేస్తున్నాయి? ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

T Jeevan Reddy

Updated On : July 9, 2023 / 6:04 PM IST

T Jeevan Reddy – CM KCR : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్, తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వరంగల్ సభలో స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. మరెందుకు కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ ఈడీ, సీఐడీ ఏం చేస్తున్నాయి? అని ప్రధాని మోదీని ఎమ్మల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు.

”రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఇప్పటికీ అలానే ఉంది. శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేయలేదు. దళితులకు కేటాయించిన 40వేల కోట్లు ఖర్చు చేయకపోగా.. మళ్ళీ బడ్జెట్ అదే రిపీట్ చేస్తూ దళితులను మోసం చేస్తున్నారు. 17వేల 700కోట్ల రూపాయలను దళిత యువతకు ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదు.
దళితులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు.

Also Read..Koonamneni Sambasivarao : తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది : కూనంనేని సాంబశివరావు

దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రాజెక్ట్ అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వరంగల్ సభ లో స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు. మరి ఆధారాలు ఉన్నా ఎందుకు సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదు? మీ ఈడీ, సీఐడీ ఏం చేస్తున్నాయి? బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలి? ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతున్నారు” అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Also Read.. Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్​తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు