‘ప్రైవేట్ బస్సుల్లో సంక్రాంతికి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే..’
అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అంతేకాదు సరుకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Private Travels
Private Travels Representative Image (Image Credit To Original Source)
- ప్రైవేట్ ట్రావెల్స్ కు వార్నింగ్
- పండగ దోపిడీపై సీరియస్
- అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్
Private Travels: తెలంగాణ రవాణశాఖ ఆదాయ వివరాలు వెల్లడించింది. 9 నెలల్లో రూ.5142 కోట్లుగా రవాణశాఖ ఆదాయం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల రవాణశాఖ ఆదాయం రూ.5142 కోట్లుగా ఉంది. ఏప్రిల్-డిసెంబర్ లక్ష్యం రూ.6165 కోట్లుగా తెలిపింది. లక్ష్యంలో 83% సాధించింది రవాణా శాఖ.
అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే చర్యలు..
ఇక, నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. సంక్రాంతి పండగా రద్దీ నేపథ్యంలో అధిక చార్జీల వసూలుపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అంతేకాదు సరుకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేజీ క్యారేజీగా అక్రమంగా నడిపితే సీజ్ చేస్తామన్నారు. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలకు అధికారులు ఆదేశాలిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ పండగ దోపిడీ..
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండక్కి అందరూ సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని ఆశిస్తారు. ఈ క్రమంలో రైళ్లు, బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. రిజర్వేషన్లు అయిపోయాయి. ఇక మిగిలింది బస్సులే. ఇదే ఛాన్స్ గా ప్రైవేట్ ట్రావెల్స్ పండగ దోపిడీకి తెరలేపాయి. డిమాండ్ ను క్యాష్ చేసుకుంటూ ఒక్కసారిగా టికెట్ రేట్లు పెంచేశాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీల బాదుడు షురూ చేశాయి. సంక్రాంతి పండక్కి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ బస్సుల చార్జీలు భారీగా పెరిగాయి. టికెట్ ధరలను అడ్డగోలుగా పెంచేశాయి. ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. చార్జీల బాదుడుతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ పండగ దోపిడీపై రవాణశాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, టికెట్ రేట్లు పెంచకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ క్రమంలో రవాణశాఖ అధికారులు స్పందించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
