టీడీపీ జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో దిగబోతోందా? ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థి ఎవరు?
జూబ్లీహిల్స్‌లో కూడా కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్లు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నందమూరి సుహాసినిని బరిలోకి దింపితే కూటమి జూబ్లిహిల్స్‌లో మెరుగైన ఓట్లు సాధింస్తుందన్న భావనలో ఉందట టీడీపీ.

TDP
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఉప ఎన్నిక జరగడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే బైపోల్ కోసం రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. భర్త చనిపోయిన సింపతీతో పాటు కమ్మ, ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోందట కారు పార్టీ అధిష్టానం.
ఇక గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికలో కైవసం చేసుకున్న కాంగ్రెస్..ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటును కూడా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ కూడా..టీడీపీ, జనసేన కూటమితో బరిలోకి దిగుతుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాస్తో కూస్తో ఓట్లు సాధించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పేలవ ప్రదర్శనే చూపించింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు బీజేపీ పోటీ చేస్తే ఒక్కసారి కూడా 25వేల ఓట్లు దాటింది లేదు. అయితే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాదించారు.
దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుని బరిలో..
ఆ తర్వాత ఆయన పార్టీ మారినా టీడీపీ క్యాడర్ బలంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ నియోజవర్గంలో కమ్మ, ఆంధ్రా సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న టాక్ నడుస్తుంది. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుని కూటమిలో భాగంగా టీడీపీ బరిలో నిలవాలని అనుకుంటుందంట. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్టు టాక్.
అయితే టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది మరో ప్రశ్న. అయితే 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేసిన సుహాసినిని పోటీకి దింపాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందంట. 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసి 70వేల 563 ఓట్లను సాధించి కమ్మ సామాజిక వర్గం, ఆంధ్రా సెటిలర్ల మన్ననలను పొందింది అని అంటున్నారు.
జూబ్లీహిల్స్‌లో కూడా కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్లు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నందమూరి సుహాసినిని బరిలోకి దింపితే కూటమి జూబ్లిహిల్స్‌లో మెరుగైన ఓట్లు సాధింస్తుందన్న భావనలో ఉందట టీడీపీ. అంతే కాకుండా టీడీపీ తెలంగాణలో రీఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తుందట సైకిల్ పార్టీ.
తన పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ సీటు ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన మద్దతుతో సత్తా చాటాలనుకుంటున్నారట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కానీ టీడీపీ కూటమి నుంచి తామే బరిలోకి దిగుతామంటోందట. కూటమిలో సీటు కేటాయింపు ఎవరికి.? బీజేపీ నుంచి దీపక్‌రెడ్డి బరిలోకి దిగుతారా?టీడీపీ నుంచి సుహాసిని పోటీ చేయబోతున్నారా? అన్నది వేచి చూడాలి.