Munugode By Election: ఆ మూడు రోజులు వైన్ షాపులు బంద్ ..
నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.

Wine Shops Closed
Munugode By Election: మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ పార్టీల నేతలు బిజీబిజీగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా మునుగోడులో ప్రచారపర్వం హోరెత్తుతోంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు నియోజకవర్గంలో గల్లీగల్లీకి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
Munugode By Poll..KA Paul Dance : మునుగోడులో కేఏ పాల్ డ్యాన్స్.. ఊరమాస్ స్టెప్పులతో ఎన్నికల ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్ లను పోలీసులు సీజ్ చేశారు. 48 మందిని అరెస్టు చేశారు. మొత్తం 118 కేసులు నమోదు చేశారు. ఇదిలాఉంటే నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.
ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నియోజకవర్గంలో ఏడు మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు.