TSRTC Bus: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు
సీటు నాది అంటే నాది అంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. పరస్పరం చెప్పులతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయారు.

TSRTC
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులు నిండిపోతున్నాయి. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు పడుతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కొందరు మరింత ముందుకెళ్లి చెప్పులతో కొట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఓ ఆర్టీసీ బస్సులో మహిళలు సీటు కోసం గొడవపడ్డారు. ఓ ఆర్టీసీ బస్సు దుబ్బాక నగర కేంద్రానికి సికింద్రాబాద్ నుంచి వెళ్లింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆ బస్సు నిండిపోయింది. తొగుట మండలంలోని వెంకట్రావు పేటకు ఆ బస్సు చేరుకున్న సమయంలో సీటు నాది అంటే నాది అంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు.
పరస్పరం చెప్పులతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. అందుకు తగ్గ బస్సుల సంఖ్యను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
Viral Video: రైలులో అందరూ చూస్తుండగా.. యువకుడిని ఘోరంగా కొట్టిన టీటీఈ