పవిత్రమైన తులసి వనంలోంచి : అయోధ్య రామ మందిరానికి యాదాద్రి మట్టి

  • Published By: nagamani ,Published On : July 22, 2020 / 11:27 AM IST
పవిత్రమైన తులసి వనంలోంచి : అయోధ్య రామ మందిరానికి యాదాద్రి మట్టి

Updated On : July 22, 2020 / 12:02 PM IST

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే రామ మందిర కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ప్రధాని మోడీ..యూపీ సీఎం యోగీ ఆదిత్యానాత్ వంటి అతి కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆలయం కోసం వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పవిత్ర జలాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదగిరి నరసింహ స్వామి సన్నిధి నుంచి కూడా మట్టిని సేకరించారు.

రామ జన్మభూమిలో భూమిపూజ సమయంలో మట్టిని వాడేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం (జులై 21,2020)మట్టిని సేకరించారు. యాదాద్రి క్షేత్రంలోని నూతన గోశాలలోని స్వామివారి పవిత్రమైన తులసి వనం నుంచి ఈ మట్టిని సేకరించారు. వాటిని ప్రత్యేక కలశాల్లో భద్రపరిచి..రామ్ మందిరం నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ మట్టి కలశాలను హైదరాబాద్‌లోని వీహెచ్‌పీ కార్యాలయానికి తరలించారు. దీన్ని అక్కడి నుంచి అయోధ్యకు చేర్చనున్నారు.