Murder For Cigarette : దారుణం.. సిగరెట్ కోసం ప్రాణ స్నేహితుడిని హత్య చేసిన యువకుడు
సిగరెట్ కోసం స్నేహితుడి ప్రాణాలు తీశాడో యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.

Murder For Cigarette : సిగరెట్ కోసం స్నేహితుడి ప్రాణాలు తీశాడో యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. అప్పటివరకు కలిసి తిరిగిన స్నేహితుల మధ్య సిగరెట్ చిచ్చు పెట్టింది. బస్తీకి చెందిన సందీప్, జగడం సాయి స్నేహితులు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దీపావళి పండుగ కావడంతో నిన్న ఉదయం నుంచి ఒకే బైక్ పై మద్యం తాగుతూ తిరిగారు. నిన్న రాత్రి గణేశ్ టెంపుల్ సమీపంలోని సూపర్ మార్కెట్ పక్క వీధిలో సిగరెట్ కొనడానికి వచ్చారు. అక్కడ ఏమైందో ఏమో కానీ స్నేహితుల మధ్య ఘర్షణ మొదలైంది. అది కాస్తా దాడులవరకు వెళ్లింది. ఘర్షణలో విచక్షణ కోల్పోయిన జగడం సాయి.. సందీప్ ను చావబాదాడు. పక్కనే సిమెంట్ ఇటుకతో సందీప్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సందీప్ ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.