Young Man Arrest : నగ్న ఫొటోలతో మార్ఫింగ్… డబ్బులు ఇవ్వాలని మహిళలకు బెదిరింపులు

నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Young Man Arrest : నగ్న ఫొటోలతో మార్ఫింగ్… డబ్బులు ఇవ్వాలని మహిళలకు బెదిరింపులు

Hyderabad Cyber Crime Police

Updated On : December 14, 2023 / 9:25 PM IST

Young Man Arrest : ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ నుండి మహిళ చిత్రాలను డౌన్‌లోడ్ చేసి వెబ్ అప్లికేషన్ మరియు వాటిని నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేస్తున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపి డబ్బులు ఇవ్వాలని సదరు మహిళలను బెదిరించాడు. ఇవ్వకపోతే ఆ చిత్రాలు పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేస్తానని హుస్సేనియాలం చెందిన మనీష్ వేధిస్తున్నాడు.

దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.