షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన అతిరథ మహారథులు.. 150 రకాల వంటకాలు..

షర్మిల తనయుడి నిశ్చితార్థానికి జగన్ దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంచు మోహన్ బాబు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన అతిరథ మహారథులు.. 150 రకాల వంటకాలు..

YS Rajareddy Engagement

Updated On : January 19, 2024 / 10:13 AM IST

YS Rajareddy Engagement: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్, గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగింది. వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు.

YS Rajareddy Engagement

Also Read: షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

షర్మిల ఇటీవలే ప్రముఖులను రాజారెడ్డి నిశ్చితార్థ, వివాహ వేడుకకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏపీలోని తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనకు షర్మిల, వధూవరులు శుభలేఖ అందించారు. జగన్, భారతి తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా జగన్, షర్మిల పలకరించుకున్నారు. మేనల్లుడికి జగన్ స్వీట్ హగ్ ఇచ్చారు.


రాజారెడ్డి నిశ్చితార్థానికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హాజరైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వచ్చి రాజారెడ్డి, అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ రిసార్ట్స్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిధులకు ప్రత్యేక వంటకాలు చేయించారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం ఫిబ్రవరి 17న రాజస్థాన్‌లో జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్‌లో విందు ఉంటుంది.

Venigandla Ramu: కొడాలి నాని గుండెల్లో రైళ్లు.. కొత్త థియరీ చెబుతున్న గుడివాడ ఎమ్మెల్యే