YS Sharmila : పాలేరు నుంచి షర్మిల పోటీ..! ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..!

త్వరలో పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు షర్మిల. YS Sharmila

YS Sharmila : పాలేరు నుంచి షర్మిల పోటీ..! ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..!

YS Sharmila To Contest In Elections

Updated On : October 10, 2023 / 12:47 PM IST

YS Sharmila – YSRTP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వైఎస్ఆర్ టీపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్నికల కార్యాచరణ ప్రకటించనుంది. ఈ నెల 12 నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారు షర్మిల. ఆరుగురితో ప్రత్యేక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ టీపీ. పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం. త్వరలో పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు షర్మిల.

Also Read : బీజేపీ హంగ్ ఆశలు.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలైన నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీ సైతం కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న నాయకులతో షర్మిల సమావేశం కానున్నారు. ఈ నెల 12 నుంచి పూర్తి స్థాయి ఎన్నికల కార్యాచరణ ప్రకటించేందుకు షర్మిల సిద్ధం అవుతున్నారు.

ఈ నెల 12 నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని షర్మిల నిర్ణయించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత వారం రోజుల అనంతరం అంటే ఈ నెల 17 లేదా 18వ తేదీన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రత్యేకంగా ఆరు మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు షర్మిల. ఆ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక తెలంగాణ ఎన్నికల్లో హామీలు ఏ విధంగా ఉండాలి అన్నదానిపై నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా మేనిఫెస్టో ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు?

ఇక పాలేరు నుంచి పోటీ చేయాలని ఇప్పటికే షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో పాలేరులో ప్రత్యేకంగా పాదయాత్ర చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. దీనిపైనా ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ విలీనానికి పూర్తి స్థాయిలో షర్మిల ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పలు మార్లు చర్చలు కూడా జరిపారు. కానీ, పార్టీ విలీనానికి సంబంధించి కాంగ్రెస్ పెద్దల నుంచి సానుకూల స్పందన రాలేదు. దాంతో ఒంటరిగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని, 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది.