YSRTP : వైఎస్సార్ సంక్షేమ పాలనే లక్ష్యం – షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవించింది. దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. 2021, జూలై 08వ తేదీ గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన విధి, విధానాలు ప్రకటించారు షర్మిల. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Sharmila Party
YS Sharmila Political Party : తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవించింది. దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. 2021, జూలై 08వ తేదీ గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన విధి, విధానాలు ప్రకటించారు షర్మిల. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించిన ఘనత వైఎస్సార్ దని, రాజకీయాలకు అతీతంగా పనులు చేశారని తెలిపారు. ఈ క్రమంలో..ఆయన మాటను నిలబెట్టడానికి, సంక్షేమ పాలన మళ్ళీ తీసుకరావడానికి..72వ జయంతి రోజున…వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు.
Read More : Anita Radhakrishnan : బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి..చేతులపై మోసుకెళ్లిన మత్స్యకారులు
విధి విధానాలు : పార్టీలో మూడు ముఖ్యమైన విభాగాలుగా రూపొందించామని 1. సంక్షేమం, 2. స్వయం అభివృద్ధి, 3. సమానత్వం అని తెలిపారు. వైఎస్ చేసిన సంక్షేమం బాట..ఇప్పటికీ రోల్ మోడల్ గా ఉందని అభివర్ణించారు. ఉచిత విద్యుత్, పావల వడ్డీ రుణ, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తపించిన దార్శికుడు వైఎస్సార్ అని కొనియాడారు. పెద్ద చదువుకోవాలనే ఉద్దేశ్యంతో…ప్రభుత్వంతో ఉచితంగా విద్య కల్పించారని తెలిపారు.
Read More : Erectile Dysfunction : కొవిడ్ దీర్ఘకాలిక కొత్త లక్షణంగా అంగస్తంభన సమస్య.. యువతలోనే హైరిస్క్ ఎక్కువ..!
పేద విద్యార్థులకు వంద శాతం రీయింబర్స్ మెంట్ ఇచ్చారని, కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లి ఉచితంగా వైద్యం చేయించుకోగలడని ఎవరూ ఊహించలేరన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004, 2006, 2008 సంవత్సరాల్లో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి..లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడమే తమ లక్ష్యమన్నారు షర్మిల.