Munugode By PoLL : మునుగోడులో టీఆర్ఎస్‌దే గెలుపు : షర్మిల

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Munugode By PoLL : మునుగోడులో టీఆర్ఎస్‌దే గెలుపు : షర్మిల

YS Sharmila's interesting comments about Munugodu by-election

Updated On : October 22, 2022 / 4:45 PM IST

Munugode By PoLL : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము కేసీఆర్ కు లేదంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికలో తమ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు అని స్పష్టంచేశారు షర్మిల. మునుగోడుకు ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్నది కాదని కొంతమంది స్వార్థపరులవల్లే వచ్చిందన్నారు.

మునుగోడులో గెలుపు కోసం భారీగా డబ్బులు ఖర్చుచేస్తోందని ఆరోపించిన షర్మిల..గెలుపు మాత్రం టీఆర్ఎస్ ది అనే అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ మునుగోడులో గెలుపు కోసం ఓటర్లను ప్రాధేయపడుతోందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని..విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు షర్మిల. పాదయాత్ర ముగిసాక పాలేరుపై ఫోకస్ చేస్తానని తెలిపారు.రాజకీయాల్లో నాకు రోల్ మోడల్ జగన్ కాదని మా నాన్న రాజశేఖర్ రెడ్డేనని స్పష్టం చేశారామె.

తెలంగాణాలో మా పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని..విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేసిన షర్మిల మరో అడుగు ముందుకేసి నాకు ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్సేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై కూడా షర్మిల విమర్శలు చేశారు. భారత్ జోడో యాత్రవల్ల తెలంగాలో ఒరిగేదేమీలేదని రాహుల్ గాంధీ అంటూ ప్రజల్లో నమ్మకంపోయిందని అన్నారు.