Crazy Living Rock : ‘రక్తపు రాయి’ శ్వాస పీలుస్తుంది..పిల్లలకు జన్మనిస్తుంది
ప్రకృతి వింతలో ఈ రాయి చాలా ప్రత్యేకమైనది. ఈ రాయి శ్వాస పీల్చుకుంటుంది. ఆహారం తీసుకుంటుంది. పిల్లల్ని జన్మినిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ రాయి గురించి విశేషాలు..

Liviing Rock
Crazy Period Rock Or Living Rock Special : రాయి. చలనం లేనిది. అంటే నిశ్చలమైనది. కానీ ఓ రాయి మాత్రం చాలా చాలా డిఫరెంట్. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అంటారు. రాళ్లు పెరుగుతాయని కూడా అంటారు. యాగంటిలో నంది విగ్రహం పెరుగుతోందనే విషయం తెలిసిందే. అంటే రాళ్లకు ఎమోషన్స్ ఉంటాయా? అంటే లేవని చెప్పటానికి లేదు. ఇవి పక్కన పెడితే రాళ్లను మనం చాలా పోలికల్లో వాడతాం. కఠినంగా ఉన్నవారిని రాతి గుండె అని అంటాం. కానీ ఓ విభిన్నమైన రాయి గురించి వింటే షాక్ అవ్వక మానం. అదే రక్తం చిందించే రాయి.ఈ రాయిని కోస్తే రక్తం వస్తుంది. అంతేకాదు ఈ రాయి శ్వాస పీల్చుకుంటుంది. పిల్లలకు జన్మనిస్తుంది కూడా. ఏంటీ షాక్ అయ్యారా? రాయి ఏంటీ పిల్లలకు జన్మనివ్వటం ఏంటీ మరీ విడ్డూరం కాకపోతే అని అనుకోవచ్చు. కానీ ఈ సమస్త సృష్టిలో వింతలకు విడ్డూరాలకు కొదువే లేదు. అటువంటిదే ఈ రాయి.‘జీవించే రాయి’. శ్వాసించే రాయి. బిడ్డలకు జన్మనిచ్చే రాయి. ‘కోస్తే రక్తం స్రవించే రాయి’. అందుకే దీన్ని ‘పీరియడ్ రాక్’, అని అంటారు.
రాయి అంటే ఇది నిజంగా రాయి కాదు. జీవించే రాయి (Living Rock). అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. ఇది రాయిలాంటి ఓ జీవి అని. నిజమే..ఈ జీవి అచ్చంగా రాయిలాగానే ఉంటుంది. దీన్ని కోస్తే రక్తం వస్తుంది. ఈ అరుదైన జీవిని సైంటిస్టులు ‘ప్యూరా చిలియెన్సిస్ రాయి’ అంటారు. ఈ రాళ్లను కట్ చేస్తే మాంసం లాంటి ఎర్రటి పదార్థం బయటకు వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. దీన్ని మార్కెట్‌లో అమ్ముతారు. ప్రజలు మాంసం రూపంలో దీన్ని కొంటారు. తింటారు.
Read more : ప్రపంచంలోనే ఫస్ట్ : హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ.. 4 నెలల శిశువు కిడ్నీలో రాళ్లు తొలగింపు
చిలీ, పెరూ సముద్రపు తీర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి ఈ రాళ్లు లాంటి జీవులు.దీన్ని చూస్తే ఎవ్వరైనా సరే రాయి అనే అనుకుంటారు. కానీ ఇది రాయి కాదు ఓ రకపు ఓ సముద్రపు జీవి. ఇది చూడ్డానికి అచ్చం రాయిలాగే ఉంటుంది. ఇది శ్వాస పీల్చుకుంటుంది. ఆహారం తీసుకుంటుంది.పిల్లలకు జన్మనిస్తుంది.అంతేకాదు దీనికి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇది జెండర్ మార్చుకునే గుణం కలదు. ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రకృతి ఈ జీవికి ఇచ్చింది. దీని సహాయంతో అది పిల్లలకు జన్మనిస్తుంది.
Read more : Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..
ఈ రక్తపు రాయిలాంటి జీవితో అనేక వంటకాలు, సలాడ్లు తయారు చేస్తారు. అందుకే ఈ జీవుల మాంసానికి స్థానిక మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. ఈ జీవి నుంచి మాంసాన్ని తీయాలంటే కత్తికి చాలా పదునుండాలి. దీన్ని ‘పీరియడ్ రాక్’, ‘లివింగ్ రాక్’ అనే పేర్లు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజలు ఈ జీవిని వండి తినటం కంటే పచ్చిగా తినడానికి ఇష్టపడతారట. ఈ లివింగ్ రార్ ను పట్టుకోవటానికి పట్టేందుకు జాలరులు సముద్రపు లోతుల్లోకి వెళ్తారు. అక్కడే ఇవి ఉంటాయి మరి.ఏది ఏమైనా ఈ ప్రకృతిలో ఉండే వింతల్లో ఈ రాక్ రాయి భలే ప్రత్యేకతే కలిగి ఉంది కదూ..ఇటువంటి వింతలు విడ్డూరాలు ఈ ప్రకృతిలో ఎన్నో..ఎన్నెన్నో..