Bihar Politics: ఆడా ఉంటా, ఈడా ఉంటా.. రెండ్రోజుల్లో విపక్షాల మీటింగ్ పెట్టుకుని అమిత్ షాను కలిసిన బిహార్ మాజీ సీఎం మాంఝీ
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్రకటించారు.

Manjhi Met Amit Shah: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ వ్యవహారం గమ్మత్తుగా ఉంది. కొద్ది రోజుల క్రితం నితీశ్ కుమార్ నుంచి అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన మాంఝీ.. తాము ఇంకా మహాగట్బంధన్తోనే ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే ఉన్నట్టుండి బుధవారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కనిపించారు. ఈ పరిణామాల్ని బట్టి చూస్తుంటే జేడీఎస్-ఆర్జేడీ కూటమికి రాం-రాం చెప్పేసి మరోసారి బీజేపీతో చేతులు కలిపేందుకు మాంఝీ సిద్ధమయ్యారని అంటున్నారు.
తన కుమారుడు సంతోష్ కుమార్ సుమన్‌తో కలిసి మాంఝీ ఢిల్లీకి వెళ్లారు. అనంతరం అమిత్ షాతో చర్చలు చేశారు. వారం క్రితమే నితీశ్ ప్రభుత్వం నుంచి సంతోష్ సుమన్ బయటికి వచ్చారు. హెచ్ఏఏం పార్టీని జనతాదళ్ యూనియన్ పార్టీలో కలపాలనే ధోరణిలో నితీశ్ కుమార్ వ్యవహరిస్తున్నరని, అందుకే ప్రభుత్వం నుంచి వైదొలగినట్లు రాజీనామా అనంతరం సంతోష్ తెలిపారు. జూన్ 23న నిర్వహించే విపక్షాల సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదట. అదే రాజీనామా వరకు దారి తీసిందని అంటున్నారు. అంతే కాదు, తిరిగి భారతీయ జనతా పార్టీతో చేతులు కలుపుతున్నారా అని అడిగితే లేదని సంతోష్ సమాధానం చెప్పారు.
Maharashtra Politics: ఈపాటికి సీఎం షిండే ఆత్మహత్య చేసుకునేవారు.. మహా విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అన్నారు. ఇది జరిగి వారం కాలేదు, అప్పుడే అమిత్ షాతో భేటీ అయ్యారు. జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్రకటించారు.
జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మహా కూటమిలో చేరారు. దీంతో సుమన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న నితీశ్.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. బిహార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరికి సంతోష్ తన రాజీనామా లేఖను సమర్పించారు.